ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు ఎదురుదెబ్బ తగిలింది.మనీలాండరింగ్ కేసులో బెయిల్ దరఖాస్తును కోర్టు కొట్టివేసింది.
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సత్యేంద్ర జైన్ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ క్రమంలో సత్యేంద్ర జైన్ సహా వైభవ్ జైన్, అంకుష్ జైన్ బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.
కాగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోని క్రిమినల్ సెక్షన్ల కింద గతేడాది మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.







