బాలీవుడ్ సౌత్ సినిమాల మధ్య తేడాలు ఇవే... సమంత కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత( Samantha ) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతుంది.

 These Are The Differences Between Bollywood South Movies Samanthas Comments Are-TeluguStop.com

ఇకపోతే సమంత నటించిన శాకుంతలం ( Shaakuntalam ) సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సమంత ముంబైలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఇలా ముంబై( Mumbai )లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంతా సౌత్ సినిమాల గురించి బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ముఖ్యంగా ఈ రెండు ఇండస్ట్రీల మధ్య ఉన్నటువంటి తేడాలు గురించి ఈమె మాట్లాడుతూ…ఈ రోజుల్లో ఉత్తరాది సినిమాలకు దక్షిణాది సినిమాలకు మధ్య ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవని తెలిపారు.ప్రస్తుతం సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయిందని అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు స్వాగతిస్తున్నారని తెలిపారు.

ఇలా సౌత్ నార్త్ ఇండస్ట్రీల మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని చెబుతూనే తనకు ఈ విషయంలో చర్చలకు తావివ్వడం ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు.నటిగా ఇండస్ట్రీలో అన్ని భాషలకు సంబంధించిన సినిమాలలో తాను నటిస్తున్నానని ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా ఇతర భాష చిత్రాలను కూడా చూస్తున్నారని ఈ సందర్భంగా సమంత సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీ గురించి తెలియజేశారు.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమాకి గుణశేఖర్ (Gunasekhar)దర్శకత్వం వహించగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ( neelima gunasekhar ) గుణ దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube