ఓహో.. జగన్ ఆ ప్లాన్ లో ఉన్నారా ?

ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు కొత్త కొత్త చర్చలకు తవిస్తున్నాయి.ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సరిస్తున్నాయి ప్రధాన పార్టీలు.

 What Is Jagan's Plan, Jagan , Ysrcp, Ap Politics , Tdp , Janasena, 2024 Election-TeluguStop.com

ముఖ్యంగా ఏపీలో ప్రధానంగా జరుగుతున్నా చర్చ ముందస్తు ఎన్నికల వ్యవహారం.అసలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఛాన్స్ ఉందా ? ప్రతిపక్షాలు పదే పదే ముందస్తు ఎన్నికల అంశాన్ని ఎందుకు హైలెట్ చేస్తున్నాయి ? ఇంతకీ ముందస్తు ఎన్నికల విషయంలో సి‌ఎం జగన్( CM jagan ) ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నారు ? ఇలాంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.

మునదస్తు ఎన్నికల అంశాన్ని అధికార వైసీపీ కొట్టి పారేస్తున్నప్పటికి, టీడీపీ, జనసేన, వైసీపీ వ్యతిరేక శక్తులు తేలికగా తీసుకోవడం లేదు.ఎందుకంటే వైసీపీని ఈ మద్య వరుస వైఫల్యలు వేదిస్తుండడంతో జగన్ ముందున్న ఒకే ఒక్క దారి ముందస్తు ఎన్నికలని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంచితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి.జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, దాంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలే ఎక్కువ అని రఘురామ( Raghu Rama Krishna Raju ) చెప్పుకొచ్చారు.

Telugu Ap, Jagan, Janasena, Pawan Kalyan, Raghurama, Ys Jagan-Latest News - Telu

బహుశా నవంబర్ లేదా డిసెంబర్ లో కచ్చితంగా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని కూడా ఆయన జోష్యం చెప్పారు.దీంతో తెలంగాణతో పాటే ఏపీలో జగన్ కూడా ఎన్నికలకు వెళ్తారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఒకవేళ జగన్ తెలంగాణను ఫాలో అయితే వైసీపీకి ఒరిగేదేంటి అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది.అయితే నవంబర్ లేదా డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేంద్రం నుంచి త్వరగా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.

Telugu Ap, Jagan, Janasena, Pawan Kalyan, Raghurama, Ys Jagan-Latest News - Telu

అందుకే సి‌ఎం జగన్ డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు( Early Elections ) వెళ్ళే ప్లాన్ లో ఉన్నారట.అయితే ముందస్తు ఎన్నికల విషయంలో వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదని, ఇదంతా ప్రతిపక్షాలు ఆడుతున్న మైండ్ గేమ్ అని చెబుతున్నారు.కానీ వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు సంకేతంగానే కనిపిస్తున్నాయని కొందరి అభిప్రాయం.

మరి వైఎస్ జగన్ ఎన్నికల విషయంలో ఎలాంటి ప్లాన్ అమలు చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube