ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రోజురోజుకూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణలో బిఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్( BRS, BJP, Congress ) పార్టీలు గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి .
ముచ్చటగా మూడవసారి కూడా అధికారం తమదే అని బిఆర్‌ఎస్ నేతలు బల్లగుద్ది చెబుతుంటే.మరోవైపు ఈసారి కేసిఆర్ ( KCR )ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేస్తామని కమలనాథులు చెబుతున్నారు.
ఇక అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న రెండు పార్టీలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని దాంతో ఈసారి తమదే విజయం అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంచితే ప్రస్తుతం వచ్చే ఎన్నికలపై బీజేపీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ ఊహించని రీతిలో బలపడుతూ వస్తోంది.జిహెచ్‌ఎంసి ఎన్నికలు మరియు, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు.వంటి నియోజిక వర్గాల్లో జరిగిన ఉపఎన్నికలను పరిశీలిస్తే అధికార బిఆర్‌ఎస్ కు ధీటుగా ఓటు బ్యాంక్ ను కైవసం చేసుకుంది.దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ పక్షానా నిలబోతున్నారని కమలనాథులు పదే పదే చెబుతున్నారు.
అయితే బిఆర్‌ఎస్ ను ఢీకొట్టి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం అంత తేలికైన పని కాదు.కేవలం ప్రజా మద్దతు పైనే కాకుండా సరైన వ్యూహాలను అమలు చేస్తేనే బిఆర్‌ఎస్ పైన పైచేయి సాధించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకం కాబోతున్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ( YSR Telangana Party, BJP, Congress )పార్టీలు కూటమి గా ఏర్పడబోతున్నాయనే వార్తలు గట్టిగానే వినిపించాయి.అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో కూటమి కొరకు ఈ రెండు పార్టీలు చేతులు కలుపుతయా ? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.అయితే తాము ఎవరితోనూ కలవడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు.
సర్వేలు అన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని తమకు ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని ధీమాగా చెబుతున్నారు.మరి బీజేపీ ఒంటరి పోరు ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.







