చెన్నై జట్టు బౌలర్లకు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వార్నింగ్..!

ఐపీఎల్ సీజన్-16 లో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై జట్టు మొదటి ఓటమిని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.అయితే చెన్నై వేదికగా జరిగిన రెండవ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి మొదటి విజయం సాధించింది.

 Captain Mahendra Singh Dhoni Warns The Bowlers Of The Chennai Team , Ms Dhoni ,-TeluguStop.com

కానీ చెన్నై జట్టు బౌలర్లపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని( MS Dhoni ) కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

తాజాగా లక్నో- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది.

ఇక చెన్నై జట్టు బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) 57 పరుగులు, డేవాన్ కాన్వే 47 పరుగులు, శివం దూబే 27 పరుగులు, అంబటి రాయుడు 27 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి రాణించడంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

218 పరుగుల లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు మొదట బాగానే రాణించి, చివరికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి ఓడింది.లక్నో జట్టు( Lucknow Super Giants ) బ్యాటర్లు కైల్ బేయర్స్ 53 పరుగులు, కేఎల్ రాహుల్ 20 పరుగులు, నికోలస్ పూరన్ 32 పరుగులు, మర్కస్ స్టోయినిస్ 21 పరుగులు, ఆయుష్ బదోనీ 23 పరుగులు చేశారు.

అయితే మొదటి మ్యాచ్ అనంతరం స్పందించిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లో తమ జట్టు బౌలర్లు వైడ్లు, నోబాల్స్ రూపంలో 16 ఎక్స్ ట్రా పరుగులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.అంతేకాదు తమ జట్టు బౌలర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.ప్రత్యర్థి బౌలర్లు వేసే బౌలింగ్ ని గమనించడంతోపాటు, పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం, బౌలింగ్లో మెరుగవడం లాంటి వాటిపై దృష్టి పెట్టడం చాలా అవసరమని తెలిపాడు.

ఇక లేటుగా బ్యాటింగ్ కు వచ్చిన ధోని లేటెస్ట్ గా రెండు వరుస సిక్సులు బాదిన సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube