Salman Khan: హీరోయిన్ కి ముద్దులు పెట్టిన సల్మాన్ ఖాన్.. పక్కకు వెళ్లి ఏం చేశాడో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సల్లు బాయ్ కి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.

 Salman Khan Kissed Jacqueline Fernandez And Wiped His Mouth With His Tshirt-TeluguStop.com

బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు సల్మాన్ ఖాన్. తెలుగు సినిమాలను రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఈ హీరో స్పెషాలిటీ.

ఇప్పటికే హలో బ్రదర్, ప్రేమ, పోకిరి, రెడీ, స్టాలిన్, కిక్ సినిమాలను రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు సల్లు భాయ్.

తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటను సల్మాన్ ఖాన్ సినిమాలో పెట్టారు.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలో బతుకమ్మ పాటను( Bathukamma song ) పెట్టడం ద్వారా ఇంకో మెట్టు ఎక్కేశారు.

ఈ సంగతి పక్కన పెడితే సల్మాన్ ఖాన్ కి అమ్మాయిలలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.చాలామంది హీరోయిన్స్ తో సల్మాన్ ఖాన్ కి మంచి సాంగత్యం ఉంది.

చాలా మంది హీరోయిన్స్ ని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఆ లిస్టులో శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్( Jacqueline Fernandez ) కూడా ఉంది.

ఈమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.జాక్వెలిన్, సల్మాన్ ఖాన్ లు కలిసి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.కిక్ సినిమాలో ఈ ఇద్దరూ తొలిసారిగా కలిసి నటించారు.2014లో విడుదలైన ఈ సినిమాతో జాక్వెలిన్ కి వరుస ఆఫర్లు వచ్చాయి.ఆ తర్వాత ఈ ఇద్దరూ రేస్-3, రాధే వంటి సినిమాల్లో నటించారు.కాగా తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ కి వరుసగా రెండు సార్లు ముద్దు పెట్టాడు.ఆ తర్వాత తన పెదాలను టీ షర్ట్ కి తుడుచుకున్నారు.ఆ వీడియో షూటింగ్ సెట్స్ లో తీసిన వీడియో అని తెలుస్తోంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక పక్కన నిలుచుని ఉండగా సల్మాన్ ఖాన్ ఆమె బుగ్గ పై ముద్దు పెట్టాడు.

జాక్వెలిన్ నవ్వుకుంటుంటే సల్మాన్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయి తన మూతిని టీ షర్ట్ తో తుడుచుకున్నాడు.ఆమె బుగ్గ మీద ఉన్న మేకప్ తన పేదలకు అంటుకోవడం వల్ల సల్మాన్ ఇలా పెదాలను తుడుచుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube