భారత మార్కెట్లో ఏప్రిల్ 4న లాంచ్ అవ్వడానికి వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్( OnePlus Nord CE 3 Lite ) సిద్ధంగా ఉంది.భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.21,999 గా ఉండనుంది.ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చీఫ్ సెట్ ద్వారా వస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ధృవీకరించింది.వన్ ప్లస్ RAM ను వర్చువల్ గా విస్తరించుకునే అవకాశం, 8 GB వరకు RAM బ్యాక్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇక దీని స్క్రీన్ 6.72 అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతు, 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా తో ఉంది.
పాత వెర్షన్ లో ఉండే 64 మెగా పిక్సెల్ సెన్సార్ కంటే అప్గ్రేట్ అవుతుంది.ఈ 5G మొబైల్ ఫోన్లో 5000 mAh బ్యాటరీ( 5000 mAh battery ) ఉండడంతో, 67W ఫాస్ట్ చార్జర్ ను అందిస్తోంది.30 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ అవుతుంది.పాస్టర్ లైమ్, క్రోమటిక్ గ్రే రంగులలో విడుదల అవ్వనుంది.గతంలో వన్ ప్లస్ నోర్డ్ C2 లైట్ భారత్లో రూ.19,999 తో విడుదల చేయబడింది.ఇక తాజాగా లాంచ్ అవబోతున్న వన్ ప్లస్ నోర్డ్ C3 ధర రూ.21,999 గా ఉండనుంది.ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారి కోసం కంపెనీ ఎర్లీ బర్డ్స్ ప్రయోజనాలను వెల్లడించింది.ముందుగా కొనుగోలు చేసుకున్న వారు ఈ పరికరం కొనుగోలు పై ఉచిత వన్ ప్లస్ ఉత్పత్తి పొందవచ్చు.
అంతేకాకుండా మంచి డిస్కౌంట్ ఆఫర్ తో వారంటీ ప్లాన్ కూడా పొందవచ్చు.ఇక ప్రత్యేకంగా కొన్ని బ్యాంకు కార్డ్ లపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.







