టీ చేసిన తర్వాత పొడిని పడేస్తున్నారా? అయితే మీరు ఈ ప్రయోజనాలు మిస్ అయినట్టే..

మనదేశంలో దాదాపు చాలామంది ఎక్కువగా టీ ని తాగడానికి ఇష్టపడతారు.మన దేశంలో ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా టీ తాగుతూ ఉంటారు.

 Dropping The Powder After Tea Powder? But If You Miss These Benefits , Keffin-TeluguStop.com

చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీ నీ( Tea Powder ) తాగేందుకు ఇష్టపడతారు.ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం టీ తాగుతారు.

అయితే టీ ని తయారు చేసుకోవడానికి కొంతమంది పౌడర్ నీ వినియోగిస్తారు.ఇక మరికొందరేమో టీ ఆకులను ఉపయోగిస్తారు.

అయితే టీలో మంచి సువాసన రావడానికి టీ ఆకులను ఉపయోగిస్తారు.

దీని వల్ల టీ రుచి మరింత పెరుగుతుంది.

టీ ఆకులలో కెఫిన్( Keffin ) ఉండడం వలన శరీరానికి ఇది శక్తిని అందజేస్తుంది.అయితే ప్రతి ఇంట్లోనూ కూడా టీ తాగిన తర్వాత టీ ఆకులను పారేస్తారు.

ఈ టీ ఆకుల వల్ల ఎన్నో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిగిలిన టీ ఆకులను జుట్టుకు సహజమైన కండిషనర్ గా ఉపయోగించవచ్చు.అయితే ఈ టీ ఆకులను ఉడకబెట్టాలి.

ఉడకబెట్టిన ఆ నీటితో జుట్టును కడగాలి.

దీనివల్ల ఇది కండిషనర్ గా బాగా ఉపయోగపడుతుంది.ఇక ఈగలతో చాలామంది ఇళ్లలో ఇబ్బంది పడుతుంటారు.అలాంటి సమయంలో నీటిలో ఉడకబెట్టిన ఆకులతో ఇంటి మొత్తాన్ని తుడవాలి.

దీంతో ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి.ఇక ఎవరికైనా గాయమైతే ఇది నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఎందుకంటే టీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) ఉంటాయి.ఆకులను బాగా శుభ్రం చేసిన తర్వాత, మరొకసారి నీటిలో ఉడకబెట్టాలి.

ఇక చల్లారాక ఆ నీటిని గాయంపై అప్లై చేయాలి.దీంతో గాయం నయం అవుతుంది.ఇక వంట పాత్రలు కూడా బలమైన నూనె మరకలతో ఉంటాయి.వీటిని తొలగించడంలో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు.అయితే మరకలు ఉన్న ఆ గిన్నెలో టీ ఆకులను బాగా ఉడకబెట్టాలి.దీంతో ఆ పాత్రలకు ఉన్న మురికి మొత్తం శుభ్రంగా క్లీన్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube