హిందూఫోబియాకు వ్యతిరేకం : జార్జియా రాష్ట్రం సంచలన నిర్ణయం.. అమెరికాలోనే తొలిసారి

అమెరికాలోని( America ) కొన్ని రాష్ట్రాలు ఇటీవలికాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి, ముఖ్యంగా మనదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం సీటెల్ నగరం కులవివక్షను నిషేధిస్తూ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

 Georgia Becomes First Us State To Pass Resolution Condemning Hinduphobia Details-TeluguStop.com

ఆ తర్వాత గర్భ నిరోధక మాత్రలను నిషేధించి వ్యోమింగ్ రాష్ట్రం చరిత్ర సృష్టించింది.తాజాగా జార్జియా రాష్ట్రం( Georgia ) కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

రాష్ట్రంలో హిందూఫోబియాను ( Hinduphobia ) ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టింది.లారెన్ మెక్ డోనాల్డ్, టాజ్ జోన్స్ అనే చట్టసభ సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ప్రపంచంలోని అతి పురాతన, పెద్ద మతాల్లో హిందూ మతం ఒకటని.దీనిని అనుసరించేవాళ్లు దాదాపు 100 కోట్లకు పైగా వుంటారని తీర్మానంలో ప్రస్తావించారు.భిన్న సంస్కృతులు, నమ్మకాలతో హిందువులు జీవిస్తారని పేర్కొన్నారు.అట్లాంటాలోని ఫ్రోస్తీ కౌంటీలో హిందువులు పెద్ద సంఖ్యలో వున్నారని.

వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ, ఫైనాన్స్, ఎనర్జీ, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లో ఇండో అమెరికన్లు కీలకపాత్ర పోషిస్తున్నారని వారు ప్రశంసించారు.

Telugu Racism, Americanhindu, Hinduphobia, Georgia, Kshama Sawanth, Lauren Mcdon

గడిచిన కొద్దిరోజులుగా దేశంలోని హిందూ అమెరికన్లపై దాడులు పెరుగుతున్నాయని.హిందూ మత పవిత్ర గ్రంథాలు, విధానాలపైనా దాడులు జరుగుతున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.ఇకపోతే.

కొద్దిరోజుల క్రితం అమెరికాలోని సీటెల్ నగరం సంచలన తీర్మానం చేసింది.కుల వివక్ష చట్ట విరుద్ధమని ప్రకటించిన తొలి అమెరికా నగరంగా నిలిచింది.

ఇందుకోసం భారత సంతతికి చెందిన క్షమా సావంత్ మొక్కవోని పోరాటం చేశారు.ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీటెల్ సిటీ కౌన్సిల్ 6-1 ఓట్ల తేడాతో ఆమోదించింది.

Telugu Racism, Americanhindu, Hinduphobia, Georgia, Kshama Sawanth, Lauren Mcdon

కుల వివక్షను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించడం వల్ల దక్షిణాసియా ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయులకు, హిందువులకు ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభించినట్లేనని కౌన్సిల్ అభిప్రాయపడింది.అమెరికాలోని కంపెనీలు, కార్యాలయాల్లో దక్షిణాసియా వాసులు, వలస కార్మికులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారని క్షమా సావంత్ తన తీర్మానంలో తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక తీర్మానానికి సీటెల్ కౌన్సిల్ తీర్మానం లభించిన నేపథ్యంలో క్షమా సావంత్ .దీనిని అమెరికా వ్యాప్తం చేయాల్సిన అవసరం వుందన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube