టాలీవుడ్ డిజాస్టర్ల నిర్మాతకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన నాని.. జాతకం మార్చేశాడుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ సాధించడం సులువు కాదు.చాలామంది నిర్మాతలు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ దక్కక ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు ఉన్నాయి.

 Shocking Facts About Produceer Sudharkar Cherukuri Details Here Goes Viral, Prod-TeluguStop.com

సుధాకర్ చెరుకూరి( Sudhakar Cherukuri ) టాలీవుడ్ లోని పాపులర్ ప్రొడ్యూసర్లలో ఒకరు కాగా ఈ నిర్మాత నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ నిర్మాత సినిమాలు మంచి సినిమాలుగా పేరు సంపాదించుకున్నా బయ్యర్లకు భారీగా నష్టాలను మిగిల్చాయి.

సుధాకర్ చెరుకూరి కూడా ఒక నిర్మాతగా సందీప్ కిషన్( Sandeep Kishan ) హీరోగా 2016లో రన్ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఈ బ్యానర్ లోఏ తెరకెక్కగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి.రామారావు ఆన్ డ్యూటీ, విరాటపర్వం సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.

సాధారణంగా ఐదు డిజాస్టర్లు వచ్చిన తర్వాత ఏ నిర్మాత అయినా ఇండస్ట్రీకి దూరమవుతారు.అయితే సుధాకర్ చెరుకూరి మాత్రం ఇతర నిర్మాతలకు భిన్నంగా అడుగులు వేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.సుధాకర్ చెరుకూరి దరిద్రం నాని( Nani ) సినిమాతో తొలగిపోయిందని ఇకపై ఆయనకు అన్నీ విజయాలే దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుధాకర్ చెరుకూరి గ్రేట్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సుధాకర్ చెరుకూరి భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.రాబోయే రోజుల్లో ఈ నిర్మాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాని సుధాకర్ చెరుకూరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయేమో చూడాలి.దసరా( Dussehra ) సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది.

సుధాకర్ చెరుకూరి ఇకపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కెరీర్ ను కొనసాగిస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube