ఇటీవలే కాలంలో అక్రమాలు, దారుణాలు పెరుగుతూ పోతూ భవిష్యత్తు కాలంలో సమాజంలో ఒంటరిగా జీవించే వాళ్లకు, ఒంటరిగా తిరిగే వాళ్లకు అడుగడుగునా కష్టాలే అనిపిస్తుంది.ఓ ఆడది అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎటువంటి భయం లేకుండా నడుచుకుంటూ వెళ్ళినప్పుడే పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు లెక్క.
నేటి సమాజంలో అర్ధరాత్రి కాదు కదా పగటిపూట కూడా ఆడవారు ఒంటరిగా తిరిగే పరిస్థితులు కనిపించడం లేదు.ఇంట్లో నుండి బయటికి వెళ్లిన మహిళలకు రక్షణ కరువైంది.
ప్రయాణాలు చేయాలన్నా, ఉద్యోగాలు చేయాలన్న, ఇతర పనుల కోసం బయటకు వెళ్లి రావాలన్న చాలా కష్టం.నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలలో ఒంటరి మహిళ కనిపిస్తే కచ్చితంగా అత్యాచార దాడులు( Rape attacks ) చవిచూస్తున్నాయి.
అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలోని( Karnataka ) బెంగుళూరు నగరంలో ఓ యువతి ఫ్రెండును కలవడం కోసం పార్కుకు వెళ్ళింది.కాసేపటికి ఓ నలుగురు వ్యక్తులు ఆ మహిళపై కన్ను వేసి, లాకెళ్లి కారులో నగరం అంతా తిప్పుతూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బెంగళూరు సీనియర్ పోలీస్ ఆఫీసర్ సీకె బాబా తెలిపిన వివరాల ప్రకారం ఓ యువతి తన ఫ్రెండును కలవడం కోసం మార్చి 25 సాయంత్రం కోరమంగల్ లోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్ కు వచ్చింది.
తన ఫ్రెండ్ వచ్చాక కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు.ఆ తర్వాత తన ఫ్రెండ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.ఎవరూ లేని సమయం చూసి బలవంతంగా కారులోకి లాక్కెళ్ళి నగరం అంతా తిప్పుతూ నలుగురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తెల్లవారుజామున యువతిని ఆమె ఇంటి వద్దనే వదిలిపెట్టి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయారు.ఆ యువతి తల్లిదండ్రుల సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.