టాలీవుడ్ డిజాస్టర్ల నిర్మాతకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన నాని.. జాతకం మార్చేశాడుగా!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ సాధించడం సులువు కాదు.చాలామంది నిర్మాతలు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ దక్కక ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు ఉన్నాయి.
సుధాకర్ చెరుకూరి( Sudhakar Cherukuri ) టాలీవుడ్ లోని పాపులర్ ప్రొడ్యూసర్లలో ఒకరు కాగా ఈ నిర్మాత నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఈ నిర్మాత సినిమాలు మంచి సినిమాలుగా పేరు సంపాదించుకున్నా బయ్యర్లకు భారీగా నష్టాలను మిగిల్చాయి.
సుధాకర్ చెరుకూరి కూడా ఒక నిర్మాతగా సందీప్ కిషన్( Sandeep Kishan ) హీరోగా 2016లో రన్ అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.శర్వానంద్ హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఈ బ్యానర్ లోఏ తెరకెక్కగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి.
రామారావు ఆన్ డ్యూటీ, విరాటపర్వం సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. """/" /
సాధారణంగా ఐదు డిజాస్టర్లు వచ్చిన తర్వాత ఏ నిర్మాత అయినా ఇండస్ట్రీకి దూరమవుతారు.
అయితే సుధాకర్ చెరుకూరి మాత్రం ఇతర నిర్మాతలకు భిన్నంగా అడుగులు వేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
సుధాకర్ చెరుకూరి దరిద్రం నాని( Nani ) సినిమాతో తొలగిపోయిందని ఇకపై ఆయనకు అన్నీ విజయాలే దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సుధాకర్ చెరుకూరి గ్రేట్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. """/" /
సుధాకర్ చెరుకూరి భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.
రాబోయే రోజుల్లో ఈ నిర్మాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నాని సుధాకర్ చెరుకూరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయేమో చూడాలి.దసరా( Dussehra ) సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది.
సుధాకర్ చెరుకూరి ఇకపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కెరీర్ ను కొనసాగిస్తారేమో చూడాలి.
వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ చాలట్లేదు.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!