మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లో పలు కీలక విషయాలను బయట పెట్టింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడని సీబీఐ పేర్కొంది.
వివేకాను మరో ముగ్గురితో కలిసి హత్య చేశారని సీబీఐ పిటిషన్ లో తెలిపింది.
గంగిరెడ్డికి రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడించాయి.వివేకా హత్య కేసు నిందితులందరూ కడప జిల్లా వారేనని పేర్కొన్నారు.
సాక్షులను గంగిరెడ్డి బెదిరించినట్లు విచారలో వెల్లడైందన్నారు.అంతేకాకుండా వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నను కూడా గంగిరెడ్డి బెదిరించారని తెలిపింది.
ఈ మేరకు రంగన్న స్టేట్ మెంట్ జ్యుడిషయల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టామన్నారు.హత్య చేసిన అనంతరం వివేకాది గుండెపోటు, రక్తపు వాంతులు అని డ్రామా చేశారన్నారు.
సాక్ష్యాధారాలను గంగిరెడ్డి, శివ శంకర్ రెడ్డి ధ్వంసం చేశారని తేలిందన్నారు.ఈ సందర్బంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును కోరింది సీబీఐ.