'దసరా' రెస్పాన్స్ పై సంతోషంలో తేలిపోతున్న నాని.. అలా పోస్ట్ చేసి..

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ( Nani ) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”దసరా”( Dasara ).ఈ సినిమా నిన్న మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.

 Nani Interesting Post On Dasara Movie Super Hit, Dasara, Nani, Keerthy Suresh, S-TeluguStop.com

మహానటి కీర్తి సురేష్( Mahanati Keerthy Suresh ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

నాని ధరణి పాత్రలో, కీర్తి వెన్నెల పాత్రలో నటించి ఈ సినిమాను మరో లెవల్ కు చేర్చారు.ముఖ్యంగా నాని ఎప్పటి నుండి ఈ సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు.చెప్పి మరీ హిట్ కొట్టినవ్ అంటూ నాని మీద ఓ రేంజ్ లో ప్రశంసలు వస్తున్నాయి.

ఇక నాని మాస్ యాక్టింగ్ కు ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు అనే చెప్పాలి.ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

ఈ సినిమా ముందు నుండి భారీ ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి.మాస్ యాక్షన్ రస్టిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్( Super Hit Response ) అందుకోవడంతో నాని ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఆడియెన్స్ నుండి ఈ రేంజ్ లో ఎంకరేజ్ మెంట్ అండ్ అప్రిషియేషన్ రావడంతో నాని ఈ ఆనందంలో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.

ఈయన తమ దసరా సినిమా ఆడియెన్స్ కు, ఫ్యాన్స్ కు బాగా నచ్చడంతో వారి నుండి మంచి రెస్పాన్స్ రావడంతో సంతోషంలో కొద్దీ సేపటి క్రితం నెట్టింట పోస్ట్ చేస్తూ ” మీరు మా దసరా సినిమాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదములు.మీ ప్రేమ అంతా నా హృదయంలో ఎప్పటికి నిలిచి పోతుంది” అంటూ ఈయన పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube