మనందరికీ తెలిసిందే.బ్యాంకులు అనేవి ఎప్పటికప్పుడు కొన్ని స్కీమ్స్ ప్రకటిస్తూ ఖాతాదారులను ఊరిస్తూ ఉంటాయి.
ఒక్కోసారి చాలా మంచి స్కీమ్స్ ని తీసుకొస్తూ ఉంటాయి.అయితే ఆయా స్కీమ్స్‌లో చేరడానికి చివరి తేదీ అనేది ఒకటుంటుంది.
ఇపుడు ఓ రెండు పాపులర్ స్కీమ్స్‌లో చేరడానికి రేపే లాస్ట్ డేట్ అని చెబుతున్నారు బ్యాంకర్లు.సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులు ఉంటే వడ్డీ చాలా తక్కువగా వస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ అయితే కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది.రిస్క్ ఏమీ ఉండదు.
అందుకే రిస్క్ లేకుండా వడ్డీ పొందాలనుకునేవారు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ని ఎక్కువగా ఎంచుకుంటూ వుంటారు.

అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో పలు రకాలు ఉంటాయి.బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో కూడా ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలను అప్పుడప్పుడూ ప్రకటిస్తుంటాయి.ఇలాంటి పధకాలు అప్పుడప్పుడు తీసుకు వస్తూ వుంటారు.
ఆ సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో చేరినవారికి మాత్రమే ఎక్కువ వడ్డీ వర్తిస్తుంది.ఇపుడు అలాంటి రెండు పథకాలు మార్చి 31న ముగియనున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతకాలం క్రితం ‘అమృత్ కలష్( SBI Amrit Kalash )’ పేరుతో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకటించిన సంగతి విదితమే.కాగా 2023 మార్చి 31 వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని అప్పుడే తెలిపింది.400 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఇది కాగా ఇందులో చేరినవారికి 7.60 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.దీనికి నేడే లాస్ట్ డేట్.

అదేవిధంగా కరోనా కాలంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్( HDFC Bank ) సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఒకదానిని ప్రకటించింది.2020 మేలో ఈ పథకం అందుబాటులోకి రాగా పలుమార్లు ఈ స్కీమ్‌ని పొడిగించింది ఆ బ్యాంక్.ఈ స్కీమ్ కూడా నేటితో అంటే 2023 మార్చి 31న ముగియనుంది.రూ.5 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.సాధారణంగా వృద్ధులకు 0.50 శాతం వడ్డీ( Senior Citizen ) అదనంగా ఇస్తారన్న సంగతి తెలిసిందే.ఇది కాకుండా అదనంగా మరో 0.25 శాతం వడ్డీ పొందొచ్చు.అయితే 2023 మార్చి 31 లోపు ఈ స్కీమ్‌లో చేరేవారికి మాత్రమే అదనంగా వడ్డీ లభిస్తుంది.







