సమ్మర్ హడావిడి మొదలైంది.ఇప్పటికే మధ్యాహ్నం టైం లో ఎండ వేడి తట్టుకోలేకపోతున్నారు.
తెలంగాణా రాష్ట్రలో ఈ నాలుగుర్ రోజులు మరింత ఎండలు ఉండనున్నాయని ( Department of Meteorology )వాతావరణ శాఖ సూచిస్తుంది.నాలుగు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం నుంచే ఏప్రిల్ 3వ తారీఖు వరకు తెలంగాణాలోని వివిధ జిల్లాల్లో ఎండలు అదిరిపోతాయని అంటున్నారు.కొన్ని జిల్లాల్లో కేవలం రెండు డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయట.

ఏది ఏమైనా శుక్రవారం నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.ఉష్ణోగ్రత అధికంగా ఉండే జిల్లాలను కూడా ప్రకటించింది వాతావరణ శాఖ.ఆదిలాబాద్( Adilabad ), మంచిర్యాల, నారాయణపేట, కుమురం భీం ఆసిఫాబాద్, గోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఈ ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం కొన్నిచోట్ల 43.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.రంగారెడ్డి జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా బయట పనిచేసే వారు ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.తెలంగాణా(Telangana )లోని 9 జిల్లాల్లో ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు.







