స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) దర్శకత్వం వహించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్( Ponniin Selvan ).గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లో విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.
కాగా ఈ చిత్రం దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే.

ఈ సినిమాలో చియాన్ విక్రమ్,జయం రవి,కార్తీ, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో నటించారు.రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ 2 ( Ponniin Selvan 2 )సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.
ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న అప్డేట్లను విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఆత్రుతని అంచనాలను మరింత పెంచుతున్నారు డైరెక్టర్.ఈ నేపథ్యంలోనే తరచూ ఈ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది.
ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది.

అయితే చాలావరకు ఒక వర్గం ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని అంతగా ఇష్టపడలేదు.దీంతో చాలా వరకు ప్రేక్షకులు ఈ సినిమా పార్ట్ 2 కూడా అంతే ఉంటుంది అంటూ అంచనా వేశారు.కానీ ప్రేక్షకుల అంచనాలను తప్పు అని నిరూపించారు డైరెక్టర్ మణిరత్నం.
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఖచ్చితంగా చూడాలి అనే ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా చేశారు.పిఎస్ 2 ట్రైలర్ లో ఏదో కొత్తదనం సినిమాను చూడాలి అనిపించే భావన ప్రేక్షకులలో కలిగించారు.
ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్ లు కానీ, గెటప్ లు కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, సిజి వర్క్ లు కానీ ఏ ఒక్కటీ ఏ వంకా పెట్టనంతగా ఉన్నాయి.రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
మొత్తానికి డైరెక్టర్ పిఎస్ 2 ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.సినిమాను మెచ్చుకుంటారు అనే విధంగా చేస్తున్నారు డైరెక్టర్ మన రత్నం.
పలువురు నెటిజెన్స్ కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.
మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.







