పశ్చిమగోదావరి జిల్లా శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి నెలకొంది.తణుకు మండలం దువ్వలోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి.తారాజువ్వలు పడటంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
దీంతో ఆలయంలో ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.మరోవైపు వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు.







