రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర)పాఠశాలలో సైబర్ అంబాసిడర్ ప్లాట్ ఫామ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్ మాట్లాడుతూ నేరాలు వలన సైబర్ నేరాల వలన ఎన్నో మోసాలు జరుగుతున్నాయని ఈ మోసాలను జరగకుండా స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉపయోగించాలో విద్యార్థులకు సూచించడం జరిగింది.ఫేస్బుక్, ట్విట్టర్,వాట్సాప్ యాప్ లలో మోసాల మీద విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగింది.
సైబర్ అంబాసిడర్ గావిద్యార్థుల చేతప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ సుర పరశురాములు ఉపాధ్యాయులు డివి రావు బుచ్చిరెడ్డి,ఆనందం,రాజిరెడ్డి, నాగలక్ష్మి,జబీన్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.