ఆ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న చిరంజీవి

రజినీకాంత్( Rajinikanth ) హీరోగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా దళపతి( dhalapathi ) ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయిందనే చెప్పాలి.మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళంలోను, తెలుగులోను సూపర్ హిట్ అయింది.

 Chiranjeevi Missed That Super Hit Movie, Chiranjeevi, Super Hit Movie, Rajinikan-TeluguStop.com

ఈ సినిమాని చూసిన చాలా మంది సినీ సెలెబ్రెటీలు సైతం ఈ సినిమా ని మెచ్చుకున్నారు.ఈ సినిమాని మహాభారతం లోని కర్ణుడి స్టోరీ స్ఫూర్తి తో తీశారు.

అందుకే రజినీకాంత్ కి దీంట్లో తల్లి ఉన్న కూడా ఆమె ఎవరో తెలియక ఒక అనాథల పెరుగుతాడు.పెళ్లి కి ముందే పుట్టిన బాబు ను చూసి సమాజం ఏం అంటుందో అన్న పాయింట్ తో భారతం లో కుంతి ఏ విధంగా అయితే తన కొడుకును విడిచిపెట్టి బాధపడుతుందో ఈ సినిమాలో కూడా రజినీకాంత్ వాళ్ల అమ్మ అలాగే హీరో ను వదిలిపెట్టి చాలా బాధపడుతుంది.

 Chiranjeevi Missed That Super Hit Movie, Chiranjeevi, Super Hit Movie, Rajinikan-TeluguStop.com
Telugu Chiranjeevi, Dhalapathi, Mammootty, Rajinikanth, Tollwood-Movie

అయితే అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమాలో రజినీకాంత్ ని చాలా కొత్త గా అంతకు ముందు చూడని ఒక అగ్రసివ్ రోల్ లో చూసిన జనాలు ఆయనకి అభిమానులుగా మారిపోయారు.అలాగే మమ్ముట్టి ( Mammootty )కూడా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే ఒక గొప్ప క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే మణిరత్నం మొదట ఈ సినిమా ను తమిళం లో రజినీకాంత్ తో, తెలుగులో చిరంజీవి తో తీద్దాం అని ప్లాన్ చేశారట కానీ అనుకోని కారణాల వల్ల అక్కడి సినిమాని ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేశారు…అయితే ఈ సినిమాని తెలుగులో చిరంజీవి చేసి ఉంటే ఇంకా అద్బుతం గా ఉండేది అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం రజినీకాంత్ ఒక్కడే ఈ పాత్ర చేయగలడు.ఈ పాత్ర ఆయన కోసమే రాసినట్టు గా ఉంది అంటూ మరికొందరు రజినీకాంత్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఏది ఏమైనా ఒక మంచి హిట్ సినిమాని చిరంజీవి మిస్ అయ్యాడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube