మెగా కుటుంబంలో ఏ హీరోతో అయినా ఒక సినిమాలో నటిస్తే ఆ నటుడికి మెగా ఫ్యామిలీ నుంచి మరిన్ని ఆఫర్లు రావడం సాధారణం అనే సంగతి తెలిసిందే.చిరంజీవి ( Chiranjeevi )మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టాలిన్ ( Stalin )మూవీ 2006 సెప్టెంబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలైంది.అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఒక బుడ్డోడు నటించిన సంగతి తెలిసిందే.
త్రిష చిట్టెలుక అని ఏడిపించే ఆ బుడ్డోడు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఆ బుడ్డోడి పేరు అర్మాన్( Arman ) కాగా ఆ బుడ్డోడు ఇప్పుడు పెద్దోడు అయ్యాడు.
పవన్ సాయితేజ్ హీరోలుగా సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వినోదాయ సిత్తం రీమేక్ లో అర్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది జులై నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో అర్మాన్ కీలక పాత్రలో నటిస్తుండగా పవన్ తో కలిసి అర్మాన్ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.వినోదాయ సిత్తం రీమేక్( Vinodaya Sittam ) 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.అప్పటికీ ఇప్పటికీ అర్మాన్ పూర్తిగా మారిపోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అర్మాన్ తెలుగులో హీరోగా సక్సెస్ సాధించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వినోదాయ సిత్తం రీమేక్ సక్సెస్ సాధిస్తే అర్మాన్ కు తెలుగులో సినిమా ఆఫర్లు పెరిగే అవకాశం అయితే ఉంది.అర్మాన్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అర్మాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుతున్న సంగతి తెలిసిందే.







