టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు.
సర్కార్ చేస్తున్న మంచిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారన్న మంత్రి ఆదిమూలపు చంద్రబాబు ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు.







