తామర పురుగుల నుండి మిరప పంటను సంరక్షించే పద్ధతులు..!

మిరప పంట( Chilli crop )లో అధిక లాభాలు ఏ రీతిలో ఉంటాయో.తెగులు సోకితే నష్టాలు కూడా అదే రీతిలో ఉంటాయి.

 Methods Of Protecting Chilli Crop From Caterpillars , Chilli Crop , Methods Of-TeluguStop.com

మిరప పంటకు తామర పురుగుల బెడద ( Eczema infestation )చాలా ఎక్కువ.వీటిని నివారిస్తే అధిక లాభం, నివారించ లేకపోతే అధిక నష్టం వస్తుంది.

కాబట్టి మిరప పంట సాగు చేసే రైతులు పంటపై ప్రత్యేక దృష్టి పెట్టి సస్యరక్షణ పద్ధతులు క్రమంగా పాటించాల్సి ఉంటుంది.

ఈ తామర పురుగులు మిరప పంటను ఆశించి ఆకులలో రసం పీల్చడం, లేత కొమ్మలలో రసం పీల్చడం, పువ్వుల్లోని పుప్పొడిని పీల్చడం చేస్తాయి.తద్వారా పూత సరిగ్గా రాకపోవడం, వచ్చిన పూత రాలిపోవడం, మొక్కలు గిడస బారీ పోవడం జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.మిరప పంట వేసే ముందే పొలాన్ని లోతు దుక్కులు దున్నుకోవాలి.

ఆఖరి దుక్కులో పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.పొలం చుట్టూ అక్కడక్కడ బంతిపూల మొక్కలు నాటాలి.

ఇక మిరప నాటిన తర్వాత ఓ 15 రోజులకు వర్తిసెల్లము, ఒవేరియా బాసియన కలిపి సాయంత్రం వేళలో మొక్కలు బాగా తడిచేలాగా పిచికారి చేసుకోవాలి.తర్వాత ఎకరం పొలంలో అక్కడక్కడ 30 నుండి 40 వరకు పసుపు రంగు, నీలిరంగు జిగురు అట్టలు, బుట్టలు పెట్టాలి.

పొలంలో పక్షుల స్థావరాలను ఏర్పాటు చేయాలి.పొలంలో తక్కువ తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి.

యూరియాను తక్కువ క్రమంలో వినియోగించాలి.

సూక్ష్మ పోషకాలను( Micronutrients ) అధికంగా పంటకు అందించాలి.నారును కొనకుండా పొలంలోనే వేసి పెంచి నాటుకుంటే మంచిది.తరువాత చెట్లపై కాకుండా నేలపై పడేటట్టు ఫిప్రోనిల్ గుళికలు వేయాలి.

ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల వేప కషాయాన్ని కలిపి పంటకు పిచికారి చేయాలి.పొలంలో చెత్తను కాల్చి వేయకుండా కంపోస్ట్ బ్యాక్టీరియా ద్వారా కుళ్లేటట్టు చేస్తే అందులో కర్బన శాతం పెరగడంతో నేలకు పోషకాలు అందుతాయి.

ఈ పద్ధతులు పాటిస్తే తామర పురుగుల నుండి పంటను సంరక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube