ప్రధాని నరేంద్ర మోదీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకనే కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేంద్రంలో మోదీ నియంత పాలన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.
వాళ్ల అవినీతిని ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని దుయ్యబట్టారు.రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.







