తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ (NTR) Janhvi Kapoorకొత్త సినిమా స్టార్ట్ అయ్యింది.గత కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యురల్ షూట్ కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘NTR30’ గ్రాండ్ గా ప్రముఖుల మధ్య లాంచ్ అయ్యింది.ఈ సినిమా లాంచ్ కోసం ఎంతో కాలంగా తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో కొరటాల (Koratala Shiva) ఇంకా ఎన్టీఆర్ కు విలన్ గా ఎవ్వరిని ఫిక్స్ చేయలేదు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఫైనల్ అయినట్టు టాక్ గట్టిగానే వినిపించింది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమాలో ఇంకా ఎవరిని విలన్ గా తీసుకోవాలో ఫిక్స్ అవ్వలేదంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
మరి ఇంతకీ ఎన్టీఆర్ సినిమాకు విలన్ ఎవరు ? అంటూ ఫ్యాన్స్ తెగ ఆరాలు తీస్తున్నారు.కొరటాల శివ ఆచితూచి నటీనటులను ఎంపిక చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో సినిమా రాబోతుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమా కావడంతో మరిన్ని అంచనాల మధ్య తెరకెక్కుతుంది.