కన్నడ హీరో ఉపేంద్ర( Upendra ) గురించి మనందరికీ తెలిసిందే.కేవలం హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్గా విలన్ గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఉపేంద్ర.
అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.
ఉపేంద్ర డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే డైరెక్టర్ ఉపేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఉంది అని ఒక సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth )ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.

ఆ మాటకు ఉపేంద్ర అభిమానులు అలాగే ఉపేందర్ ఎంతో సంతోషపడ్డారు.కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపేంద్ర అభిమానులు గతంలో రజనీకాంత్ అన్న మాటలను వైరల్ చేస్తున్నారు.దాంతో ఆ విషయంపై స్పందించారు హీరో ఉపేంద్ర.రజనీకాంత్ లాంటి మాస్ హీరో కి డైరెక్ట్ చేస్తారా? ఆ మాట వినడానికి చాలా అద్భుతంగా ఉంది అని తెలిపారు ఉపేంద్ర.ఇది ఇలా ఉంటే హీరో ఉపేంద్ర అలాగే కిచ్చా సుదీప్ కలిసి నటించిన తాజా చిత్రం కబ్జా.ఈ సినిమా ఇటీవలే కన్నడ తో పాటు తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే.
కబ్జా సినిమాలో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ టర్న్డ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు హీరో ఉపేంద్ర.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా అప్పుడే ఓటీటీ లోకి విడుదల కావడానికి కూడా సిద్ధంగా ఉంది.ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఒక మీడియాతో ముచ్చటించిన ఉపేంద్ర ప్రస్తుతం ఐదేళ్లకు ఒక సినిమాకు కూడా డైరెక్ట్ చేయడం లేదని కానీ డైరెక్టర్ గా అవకాశం వస్తే, అలాగే చేయాలనిపిస్తే స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తాను అని తెలిపారు.అయితే హీరో ఉపేంద్ర దగ్గర కిచ్చా సుదీప్ ఒకానొక సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి వెళ్లారట.
అప్పుడు ఉపేంద్ర సుదీప్ తో చూడడానికి బాగానే ఉన్నావు కదా హీరోగా ట్రై చేయమని సలహా ఇచ్చారట.ఇక ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సుదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ లలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.







