ప్రస్తుతం మన ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరో లు అందరు వాళ్ళు తీసిన మొదటి సినిమాలు ఎలా ఉన్నాయి, వాటికీ డైరెక్టర్స్ ఎవరు అనే విషయాలని ఒకసారి మనం తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్
( Pawan Kalyan ) పవన్ కళ్యాణ్ హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.ఈ సినిమాకి ఇ వి వి సత్యనారాయణ డైరెక్టర్ కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.ఈ సినిమాతోనే అక్కినేని నాగార్జున కోడలు సుమంత్ వాళ్ల చెల్లె అయిన సుప్రియ కూడా ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.ఆమె ఆ తరువాత సినిమాల్లో నటించలేదు…
మహేష్ బాబు
( Mahesh Babu )

మహేష్ బాబు హీరోగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా రాజాకుమారుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా ప్రీతీ జింత నటించారు.ఈ సినిమా లో విల్లన్ గా శ్రీహరి నటించాడు, అలాగే కృష్ణ గారు కూడా ఈ సినిమా లో మహేష్ బాబు నాన్న క్యారెక్టర్ లో నటించారు…
ఎన్టీయార్
( NTR )

జూనియర్ ఎన్టీయార్ బాలా రామాయణం అనే సినిమాతో చిన్నప్పుడే ఒక సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాకి డైరెక్టర్ గుణశేఖర్ అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా తరువాత ఆయన హీరోగా పరిచయం అవుతూ తీసిన సినిమా నిన్ను చూడాలని ఈ సినిమా ప్లాప్ అయింది ఇక దాంతో నెక్స్ట్ రాజమౌళి తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసాడు…ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అయితే నిన్ను చూడాలని సినిమా డైరెక్టర్ ఎవరంటే వి ఆర్ ప్రతాప్ ఈయన అంతకు ముందు నాగార్జున తో నువ్వు వస్తావని అనే సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు.దాంతో ఈ సినిమా చేసాడు అది ప్లాప్ అయింది…
ప్రభాస్
( Prabhas )

ప్రభాస్ హీరోగా ఈశ్వర్ అనే సినిమా తీసాడు.ఈ సినిమా పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది కానీ ప్రభాస్ కి హీరో గా మంచి గుర్తింపు తెచ్చింది అనే చెప్పాలి ఈ సినిమాకి జయంత్ సి పరాన్జీ డైరెక్టర్…ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా పరిచయం అయింది.ప్రభాస్ కి మంచి హిట్ మాత్రం వర్షం సినిమాతోనే పడిందనే చెప్పాలి…
అల్లు అర్జున్
( Allu Arjun )

రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన సినిమా గంగోత్రి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది…దానితో అల్లు అర్జున్ తరువాత సినిమాగా ఆర్య చేసి స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…
రామ్ చరణ్
( Ram Charan )

చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన మొదటి సినిమానే అప్పటి టాప్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ తో తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక అప్పటి నుంచి వరుస హిట్లు కొట్టి ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో గా ముందుకు దూసుకుపోతున్నాడు.ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచం మొత్తం ఆయన అంటే ఏంటో చూపించారు…
.







