Nivetha Thomas: అవైనా కాస్త గ్యాప్ లేకుండా చెయ్యొచ్చు కదా.. నివేదా థామస్ కు నెటిజన్ షాక్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి నివేదా థామస్( Nivetha Thomas ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి అని చెప్పాలి.నటనపరంగా మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో చాలా స్లోగా అవకాశాలు అందుకుంటుంది.

 Do More Posts On Social Media Netizen Requests Heroine Nivetha Thomas-TeluguStop.com

అందం పరంగా కూడా నాచురల్ గా ఉంటూ అందరి హృదయాలను ఆకట్టుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది.

తొలిసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది నివేదా.అక్కడ తొలి నటనతోనే మార్కులు సంపాదించుకుంది.ఆ తర్వాత 2016 లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఇక్కడే సెటిల్ అయ్యింది.

అలా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక కొన్ని సినిమాలలో సక్సెస్ అందుకున్న కూడా కొన్ని సినిమాలలో అంత సక్సెస్ కాలేక పోయింది.నటనపరంగా మంచి మార్కులు సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ సినిమాలు తనని నిరాశపరిచాయి.అలా కొంతకాలం సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో తన పాత్రతో బాగా ఫిదా చేసింది.

ఇక ఆ తర్వాత కూడా అంతంత గానే అవకాశాలు అందుకుంది.గత ఏడాది షాకిని డాకిని( Shakini Dhakini ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో కూడా తన నటన బాగున్నప్పటికీ కూడా ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.

బాగా డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన తమ్ముడితో కూడా చిందులేసిన డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

తనకు సమయం దొరికినప్పుడు ఎలా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్ల అడిగిన సమాధానాలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా రెండు ఫోటోలు పంచుకుంది.

అందులో తను న్యాచురల్ గా క్యూట్ గా కనిపించింది.ఇక ఆ ఫోటో చూసి తన ఫ్యాన్స్.

మీరు ఎప్పుడు నాచ్యురల్ గానే ఉంటారు.

ఎప్పుడు ఇలాగే ఉండండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఓ నెటిజన్.పోస్ట్ లు ఎక్కువగా చేయు.

ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు పోస్ట్ లకు కూడా.మూవీస్ ఎలాగో చాలా రేర్ గా తీస్తున్నారు కదా అంటూ షాకిచ్చారు.

అంటే ఆమె నుండి సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయని కాబట్టి సినిమాల లాగా పోస్టులు కూడా అలా షేర్ చేయొద్దు అంటూ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube