”VNRTrio”. అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ లాంచ్ జరుపుకుని నెట్టింట వార్తల్లో నిలిచింది.
టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) చేసింది రెండు సినిమాలే అయినా ఈయనకు మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి.ఛలో, భీష్మ వంటి రెండు హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నారు.
ఇక ముచ్చటగా మూడవ సినిమా కోసం మూడేళ్ళ పాటు గ్యాప్ తీసుకుని మరి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈయన మూడవ సినిమాను ఉగాది కానుకగా ప్రకటించిన విషయం తెలిసిందే.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నితిన్ (Nithiin)హీరోగా ప్రకటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ VNRTrio.

ఈ కాంబోలో ఇప్పటికే భీష్మ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.ఈ సినిమా ఈ ముగ్గురికి మంచి పేరు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఇదే కాంబోలో ఈసారి కొత్త జోనర్ లో సినిమా రాబోతుంది అని ప్రకటించి భారీ హైప్ తెచ్చుకున్నారు.
ఇక అలా ప్రకటించారో లేదో ఆలస్యం లేకుండా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ కూడా చేసేసారు.

ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో కొద్దీ మంది అతిథుల మధ్య గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ సినిమా లాంచింగ్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ విచ్చేసారు.ఈయనే క్లాప్ కొట్టి షూట్ స్టార్ట్ చేయగా డైరెక్టర్లు బుచ్చిబాబు సానా, హను రాఘవపూడి స్క్రిప్ట్ అందజేశారు.
అలాగే గోపీచంద్ మలినేని ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేసారు.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.చూడాలి ఈ కాంబో ఎలా ఉంటుందో.







