ఏపీలో అధికార వైసీపీ( YCP ) పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారుతోంది.జగన్( JAGAN ) ఒకటి తలిస్తే మరోటి జరుగుతుండడంతో ఏం చేయాలో అర్థంకానీ పరిస్థితిలో వైసీపీ ఉంది.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.అదికూడా 175 స్థానాలను కైవసం చేసుకొని మరో 30 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించాలని టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కలలు ఒక్కక్కటిగా ఆవిరైపోతున్నాయి.
ప్రస్తుత పరిస్థితులను చూస్తే 175 సంగతి ఏమో గాని.అధికారం దక్కితే చాలానే భావనాకి వైఎస్ జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి విస్తోందననడానికి తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అయితే.సొంత పార్టీలో కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయనడానికి ఎమ్మెల్యే కోటా ఎలక్షన్సే నిదర్శనం.

సొంత పార్టీలోని ఓ ఇద్దరి ఎమ్మెల్యేల ఓటు టీడీపీకి చేరినందున ఊహించని విధంగా ఎమ్మెల్యేల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ.ఇది నిజంగా జగన్ కు చావు దేబ్బే అని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇతర పార్టీ అభ్యర్థిని గెలిపించడం నిజంగా జగన్ కు అవమానమే.టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మేల్యేలు ఎవరనే సంగతి పక్కన పెడితే.
ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కూడా ఎంతమేర అసమ్మతి ఉందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.ప్రస్తుతం జగన్ కు తగులుతున్న ఎదురుదెబ్బలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు( YCP rebel MP Raghurama Krishnaraju ) చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తికరంగానే ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 5 సీట్లు కూడా కష్టమేనేమో అనే అనుమానాలను వ్యక్తం చేశారాయన.అంతే కాకుండా ఇదంతా జగన్ కర్మసిద్దాంతం అంటూ సెటైర్లు పేల్చారు.వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమేనేమో అంటూ ఎద్దేవా చేశారు రఘురామ.ఎందుకంటే వై నాట్ 175 అని జగన్ అంటుంటే మరోవైపు వై నాట్ పులివెందుల అని టీడీపీ శ్రేణులు అంటున్నారని, టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తూ పులివెందులను కైవడం చేసుకున్నా ఆశ్చర్యం లేదని రఘురామ చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఏవేవే ఊహాలతో గాల్లో మేడలు కట్టిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి అటు ప్రజల నుంచి, ఇటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండడం, ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.