సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న మంచు మనోజ్( Manchu Manoj ) మార్చి మూడవ తేదీ భూమా మౌనిక రెడ్డి( Mounik Reddy ) వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన వివాహం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఇదివరకే పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.ఇక మనోజ్ మౌనికల వివాహం మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఇంట్లో జరగడంతో ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని అందుకే తనని దూరం పెట్టారని వార్తలు వచ్చాయి.
మోహన్ బాబు( Mohan Babu ) మనోజ్ పెళ్లి గురించి ఆలోచించకపోవడంతో తమ్ముడి కోసం మంచు లక్ష్మి బాధ్యతలు తీసుకొని ఈ పెళ్లి చేశారంటూ వార్తలు వచ్చాయి.
ఇకపోతే తాజాగా మంచు మోహన్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మోహన్ బాబు ఎన్నో విషయాల గురించి తెలియజేశారు.అలాగే మనోజ్ మౌనిక వివాహం (Manoj Marriage ) గురించి కూడా ఈయన మాట్లాడారు.
మనోజ్ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే మోహన్ బాబు పెళ్లికి కూడా హాజరు కారంటూ కూడా వార్తలు వచ్చాయి.ఈ వార్తలు పై ఈయన ఘాటుగా స్పందించారు.ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ మనోజ్ తన వద్దకు వచ్చి తన పెళ్లి గురించి ముందుగానే నాకు చెప్పాడు.ఒకసారి ఆలోచించుకో అని అతనికి సలహా ఇచ్చాను.
నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న నా నిర్ణయం సరైనదని భావిస్తున్నాను అన్నాడు.బెస్ట్ ఆఫ్ లక్ చేసుకో అని చెప్పాను.మనోజ్ పెళ్లి గురించి రూమర్లు క్రియేట్ చేస్తూ విమర్శలు చేసే వారి గురించి కూడా ఈయన మాట్లాడుతూ దారిన ఏనుగు వెళుతూ ఉంటే దాని వెనకాల ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి.మనం ఎన్ని కుక్కలని ఆపగలము.
ఇక మొరిగే కుక్కలను నువ్వు మొరగనివ్వు అంటూ మనోజ్ పెళ్లి గురించి తన కుటుంబం గురించి విమర్శలు చేస్తూ తప్పుడు వార్తలు రాసే వారిని ఏకంగా ఈయన కుక్కలతో పోలుస్తూ కామెంట్లు చేశారు.ఇలా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.