అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖిల్ ఏజెంట్ మూవీ( Akhil Agent Movie ) ఇప్పటి వరకు మినిమం బజ్ క్రియేట్ చేయడంలో విఫలమైంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను దర్శకుడు సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) తెరకెక్కించాడు.
ఈ సినిమా నిర్మాణం లో తాను కూడా భాగస్వామ్యం అవ్వడంతో కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాడని ప్రచారం జరుగుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ కంటే దాదాపుగా రెట్టింపు బడ్జెట్ ను ఖర్చు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై క్లారిటీ లేదు కానీ బడ్జెట్ విషయంలో మాత్రం కాస్త ఎక్కువగానే బజ్ వినిపిస్తుంది.కానీ సినిమాకు సంబంధించిన బజ్ మాత్రం అధికంగా లేకపోవడం విడ్డూరం.

అఖిల్ సినిమా అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా బజ్ ఉండడం లేదు.కారణం ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది.దాంతో అఖిల్ కూడా నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య( Naga Chaitanya ) మాదిరిగా చిన్న సినిమాలకు పరిమితం అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఆరంభంలో నాగ చైతన్య చిన్న సినిమాలను చేశాడు.
ఆ సినిమాలో కొన్ని హిట్ అవ్వగా కొన్ని నిరాశ పర్చాయి.

అయినా కూడా ఇప్పుడు ఆయన నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఒకింత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు.అందుకే అఖిల్ తో పోలిస్తే నాగ చైతన్య బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అఖిల్ మరియు నాగ చైతన్య లు స్టార్ హీరోలుగా.
పాన్ ఇండియా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉంటే వారు మినిమం సక్సెస్ లకే మొహం వాచి ఉన్నారు.సినిమా ల ఎంపిక విషయంలో అఖిల్ తో పోల్చితే నాగ చైతన్య బెటర్ అని… నాగార్జున కాస్త ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అవన్నీ కూడా తలకిందులు అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







