ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 లీగ్ మ్యాచ్లు పూర్తి.. లీగ్ పాయింట్లలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?

న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ తో 2023 సీజన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్( ICC World Test Championship ) లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి.లీగ్ పాయింట్లలో 66.67% విజయాలతో టాప్ లో ఉండే ఆస్ట్రేలియాకు, ( Australia ) 58.80% విజయాలతో రెండవ స్థానంలో నిలిచిన భారత్ కు జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ విషయం అందరికీ తెలిసిందే.

 Icc World Test Championship League Points Details, Icc World Test Championship ,-TeluguStop.com

గత సీజన్ 2021 ను పరిశీలించినట్లయితే లీగ్ పాయింట్లలో టాప్ లో ఉండే భారత్ కు,( India ) రెండో స్థానంలో ఉండే న్యూజిలాండ్ కు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడింది.

ఇక రెండుసార్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరింది భారత్.ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ప్రయత్నంలో ఉంది రోహిత్ సేన.

2023 సీజన్ లీగ్ టేబుల్ లో 55.56 పాయింట్లు సాధించి సౌత్ ఆఫ్రికా మూడవ స్థానంలో ఉంది.ఒక మ్యాచ్ గెలిచి ఉంటే ఫైనల్ కు చేరేది.8 విజయాలు, ఆరు పరాజయాలు, ఒక మ్యాచ్ డ్రా చేసుకొని ఫైనల్ కు కూత వేటు దూరంలో వెనుతిరిగింది.ఇంగ్లాండ్ లీగ్ టేబుల్ లో 46.97 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.ఇక శ్రీలంక 44.44 పాయింట్లతో అయిదవ స్థానంలో నిలిచింది.అదే న్యూజిలాండ్ పై శ్రీలంక 2-0 తేడాతో గెలిచి ఉంటే ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం ఉండేది.

న్యూజిలాండ్ తన ఖాతాలో ఆరు పరాజయాలను, నాలుగు విజయాలను, మూడు మ్యాచ్లు డ్రా చేసుకొని 38.46 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచింది.పాకిస్తాన్ నాలుగు మ్యాచ్లు గెలిచి, ఆరు మ్యాచులు ఓడి, నాలుగు మ్యాచ్లు డ్రా చేసుకొని లీగ్ టేబుల్ లో 38.10 పాయింట్లతో ఏడవ స్థానంలో, వెస్టిండీస్ 34.62 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో, బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube