మొన్నటి వరకు గెలుపు ధీమా తో ఉంటూ వస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP )కి ఇటీవల వెలువడిని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగేలా చేశాయి.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని , ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఏదో రకంగా లబ్ధి చేకూరుతుందని , దీంతో తమకు 2024 ఎన్నికల్లోను తిరుగు ఉండదని , మరో ముప్పై ఏళ్ల పాటు వైసిపి నే అధికారంలో ఉంటుందనే ధీమా తో ఉంటూ వచ్చిన జగన్( JAGAN ) కు ఝలక్ తగిలింది.
ఇటీవల వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో మూడు స్థానాలను టిడిపి గెలుచుకుంది.ఆ గెలుపు ఉత్సాహంలో ఉన్న టిడిపి వైసిపిని మరింత ఇరుకున పెట్టే విధంగా ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారానికి దిగుతోంది.2024 ఎన్నికల్లో గెలిచేది తామేనని , దానికి ఇదే సంకేతాలని , వైసిపి ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయం ఎన్నికల ఫలితాలతో రుజువైందని టిడిపి ప్రచారం చేసుకుంటుంది.దీంతో వైసిపి అలర్ట్ అయింది.
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 23న జరగబోతున్నాయి. దీంతో ఏడు స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవాలని వైసిపి టార్గెట్ పెట్టుకుంది టిడిపి ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా నిలబెట్టింది.
ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే సరిపోతుంది.ఇప్పుడు వైసీపీకి ఉన్న బలంతో ఏడు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే టిడిపికి చెందిన నలుగురు , జనసేనకు చెందిన ఒక్క ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు.అయితే ఇటీవల పార్టీకి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రెబల్ గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( MLA Kotamreddy Sridhar Reddy ), అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy )వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తుంది .అలా చేస్తే టిడిపి బలం 21కి చేరుతుంది.అయితే మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిని టిడిపి తమవైపుకు తిప్పుకుంటే సులువుగా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచే అవకాశాలు ఉండడంతో జగన్ అలెర్ట్ అయ్యారు.
ఎన్నికల్లో టిడిపి కనుక విజయం సాధిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న జగన్ 7 ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ గెలుచుకునే విధంగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగానే ప్రతి ఎమ్మెల్యే పైన నిఘా పెట్టడంతో పాటు, టిడిపికి దగ్గర అవకాశాలు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయం పైన ఆరా తీస్తున్నారు. దీంతోపాటు 22 మంది చొప్పున ఎమ్మెల్యేల బాధ్యతలను ఒకరిద్దరు మంత్రులకు జగన్ అప్పగించారట.ఇటీవల కాలంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయంపై ఆరాధిస్తూ , వారిని బుజ్జగించే బాధ్యతలు పార్టీకి నేతలకు అప్పగించారు.
అలాగే ఎన్నికల ముగిసే వరకు ప్రతి ఒక్కరి పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, ఎవరు చేజారిపోకుండా ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలను వైసిపి ఖాతాలో వేసుకునే విధంగా జగన్ అన్ని చర్యలు తీసుకున్నారు.