ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోగుల జానయ్య,కుంచం జానయ్య,కుంచం సైదులు,కుంచం అజయ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ,పొత్తులు పెట్టుకునే పార్టీలేనని ఆరోపించారు.
సూర్యాపేటలో అయినా,రాష్ట్రంలో అయినా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని,ఈ విషయాన్ని ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్,మండల పార్టీ అధ్యక్షులు పందిరి రామ్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి పాటి కరుణాకర్ రెడ్డి,జిల్లా నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి, మండల నాయకులు సూర జానయ్య,వరికుప్పల లింగయ్య,బరిసెట్టి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.