సాధారణంగా చాలామంది యువత తమ అందాన్ని జుట్టు పెంచుతుందని కచ్చితంగా నమ్ముతారు.కానీ ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది దాదాపు చాలామందిలో సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది.
దీనికి తోడు వెంట్రుకలు సరిగా పెరగకపోవడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు కూడా అధికమవుతున్నాయి.
ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేయడానికి ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉపయోగించాలి.
అసలు ఈ చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొబ్బరినూనె, కరివేపాకు, మెంతి గింజలు, ఆలివ్ గింజలు, మందార పువ్వుతో తయారుచేసిన ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు రాలే( Hair fall ) సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడంతో పాటు జుట్టును అందంగా, మందంగా, బలంగా తయారు చేస్తుంది.ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒక ఇనుప పాన్, కొబ్బరి నూనె( Coconut Oil ), కరివేపాకు, మెంతులు, ఒక టీ స్పూన్ ఆలివ్ గింజలు,( Olive seeds ) మందార పూలు ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు హెర్బల్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ముందుగా ఒక ఐరన్ పాన్ తీసుకొని, అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి.ఆ తర్వాత వేడి నూనెలో కాస్త కరివేపాకు ఆకులను వేసి గ్యాస్ ఆఫ్ చెయ్యాలి.ఆ తర్వాత మెంతి గింజలు ఒక చిన్న చెంచా ఆలివ్ గింజలను కలపాలి.
ఆ తర్వాత మందార పూలను కూడా వేసి, రాత్రంతా అలాగే నిల్వ ఉంచాలి.
ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసే ముందు ఆ నూనెను ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకుని అరచేతిలో నూనె తీసుకుని జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి.
మీ స్కాల్ప్ వెనుక భాగంలో కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి.మీ వేళ్ళతో వృత్తాకారంలో మసాజ్ చేసుకోవడం వల్ల కేశాలకు ఎన్నో పోషకాలు అందుతాయి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య దూరమై, జుట్టు క్రమంగా పెరగడం మొదలవుతుంది.