జగన్ ఇన్ని తప్పులు చేస్తున్నారా ? 

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC election ) మూడు స్థానాలను వైసిపి కోల్పోవడంతో, ఆ పార్టీ నేతలు అంతా డీలపడ్డారు.ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం మాత్రం ఈ మూడు స్థానాల్లో గెలుపును బాగా ప్రచారానికి వాడుకుంటోంది.

 Is Jagan Making So Many Mistakes , Jagan, Ysrcp, Ap, Tdp, Ap Cm Jagan, Ap Govern-TeluguStop.com

ప్రజల్లో వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, అదే ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో రుజువైందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది.అసలు ఎన్నికలు ఫలితాలలో వైసిపి ఓటమి చెందడానికి కారణాలు ఏంటి అనే విషయంపై జగన్ కూడా సమీక్ష చేస్తున్నారు.

అసలు తప్పెక్కడ జరిగిందనే దానిపైన ఆరా తీస్తున్నారు.ఇక ఈ విషయంలో ఎవరిని బాధ్యులు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జగన్ వైఖరి పైన, పార్టీలోనూ, ప్రజల్లోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.జగన్ ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తాను ఒక్కడినే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, గత రాజకీయాల కంటే భిన్నంగా వ్యవహరిస్తూ వస్తుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు జగన్ వైఖరి పై అసంతృప్తి ఉందని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

సంక్షేమ పథకాలు అమలుతో పూర్తిగా ప్రజలు మద్దతు తనకే ఉందని జగన్( Jagan ) భావిస్తున్నారు.

ఇందులో తప్పు లేకపోయినా.నేరుగా తనుకు ప్రజలకు మధ్య సంబంధాలు ఉండాలని, మిగతా నాయకుల ప్రభావం కనిపించకూడదనే ధోరణి జగన్ కు ఎక్కువైందని, దీని కారణంగానే తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, గ్రామస్థాయి నాయకుల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.

అసలు చాలామంది ఎమ్మెల్యేలకు జగన్ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, నియోజకవర్గ అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించేందుకు అవకాశం లేకుండా చేయడం, గ్రామస్థాయి నుంచి అన్ని కార్యకలాపాలు వాలంటీర్లు, అధికారుల ద్వారానే చెక్కబడుతూ, ప్రజాప్రతినిధుల పాత్ర అంతంత మాత్రంగా చేయడం వంటివన్నీ ఎప్పటి నుంచో పార్టీ నేతల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Ysrcp-Politics

తన తండ్రి రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ) వైసరికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు జగన్ పై వస్తున్నాయి.పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు తమ ఇబ్బందులు, నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అవకాశం లేకుండా పోయిందని , గతంలో జనాల్లో తమకు ఉండే గౌరవ, మర్యాదలు ఇప్పుడు కనిపించడం లేదని, అసలు ప్రజాప్రతినిధుల పాత్ర లేకుండానే అన్ని వ్యవహారాలు సాగిపోతుండడంతో, ప్రజలు ఎవరూ తమను లెక్క చేయడం లేదనే అభిప్రాయం పార్టీ నాయకులలోనూ వ్యక్తం అవుతుంది.మొదటి నుంచి జగన్ అభిమానిస్తూ వస్తున్న పార్టీ నాయకులలోను ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Ysrcp-Politics

జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారని , ప్రజలంతా ఆ సంక్షేమ పథకాలను చూసి మళ్లీ వైసీపీకి పట్టం కడతారని అతి నమ్మకంతో జగన్ ఉన్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోరకంగా ఉన్నాయని, దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని టిడిపి, జనసేన( TDP, Jana Sena ) వంటి పార్టీలు చాప కింద నీరులా తమ బలాన్ని పెంచుకుంటున్నాయని, జగన్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రాకపోతే, 2024 ఎన్నికల నాటికి వైసిపి నుంచి టిడిపి, జనసేన లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే వ్యాఖ్యలు వైసిపి నాయకులు నుంచే వ్యక్తం అవుతున్నాయి.ఈ మధ్యకాలంలో జగన్ తరచూ చెబుతున్న వై నాట్ 175 వంటి డైలాగులు చెప్పడం మాని, వాస్తవాలకు తగ్గట్లుగా నడుచుకుంటేనే వైసీపీ కి మరో ఛాన్స్ ఉంటుంది తప్ప, జగన్ వాస్తవ విరుద్ధంగా నడుచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటే ముందు ముందు వైసిపి మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులు నుంచి వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube