ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.మద్యం కుంభకోణం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అభిషేక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
మరోవైపు ఇదే వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.







