పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి డిక్లరేషన్ వివాదం ముగిసింది.ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థికి అధికారి డిక్లరేషన్ పత్రాలు అందజేశారు.
అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మీ టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ పత్రాలను అందించారని తెలుస్తోంది.దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహిస్తున్నారు.అయితే రాంగోపాల్ రెడ్డి డిక్లరేషన్ పై హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే.7,543 ఓట్ల ఆధిక్యంతో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించినా డిక్లరేషన్ ఫాం ఇవ్వలేదు.డిక్లరేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో ఎట్టకేలకు కలెక్టర్ టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ పత్రం అందించడంతో హైడ్రామాకు తెరపడింది.







