సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు వారి ఫ్యామిలీలు ఎంతో లగ్జరియస్ లైఫ్ లో లీడ్ చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.తినే తిండి నుంచి వేసుకుని చెప్పుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవే ఉపయోగిస్తూ ఉంటారు.
ముఖ్యంగా సెలబ్రిటీలు ధరించే దస్తులు వాళ్ళు తిరిగే కార్లు, నివసించే కార్లు, వాచ్ లు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవే చెప్పవచ్చు.వాటి ధరలు లక్షలు లేదా కోట్లు ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు స్పెషల్ ఈవెంట్లను ఖరీదైన దుస్తులు వస్తువులు ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
ఇక ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా అక్కడ సెలబ్రిటీలు ధరించిన వస్తువుల గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ధరించే వాచ్ లు, షూ, దుస్తులు ఇలా ప్రతి ఒక్క విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఇకపోతే మొన్నటికి మొన్న ఆస్కార్ ఈవెంట్లో కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్ ని ధరించి సోషల్ మీడియాలో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తాజాగా దుస్తుల విషయంలో సోషల్ మీడియాలో నిలిచారు.

తారక్ ధరించిన హుడీ ( Hoodie ) ఒకటి వైరల్ అవుతోంది.తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak sen ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు తారక్.ఆ సమయంలో తారక్ ఒక హుడీ ధరించాడు.ఆ హుడీ అభిమానులు విపరీతంగా నచ్చడంతో దాని గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా శిల్పకళా వేదికలో జరిగింది.ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్లాక్ హుడీ ధరించి పాల్గొన్నారు.
ఆ హుడీపై బ్లాక్ అండ్ వైట్ షేడింగ్ లో మంటల డిజైన్ ఉంది.చూసేందుకు ఆ హుడీ ఎంతో యునీక్ గా కనిపించింది.

బ్లాక్ కలర్ హుడీపై వైట్ కలర్ లో మంటలు వస్తున్నట్లుగా గ్రాఫిక్ ప్రింట్ ఉంది.ఇది బ్లాక్ ఆరెంజ్ కాంబో కలర్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది.ఈ హుడీ ధర విషయానికి వస్తే.ఇది ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.15 వేలు. తారక్ వేసుకున్న టీ షర్ట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీ షర్టు చాలా బాగుందని తారక్ బాగా సెట్ అయింది అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







