కుక్కల నుంచి కరోనా వైరస్ .. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెల్లడి..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మానవ సృష్టి కాదంట.అవును ఈ విషయాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చిందని సమాచారం.

 Corona Virus From Dogs .. International Scientists Revealed..!!-TeluguStop.com

చైనా వుహాన్ లోని చేపల మార్కెట్ లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యు పదార్థంలో కోవిడ్ కారక సార్స్ కోవ్ -2 వైరస్ ను గుర్తించామని సైంటిస్టులు తెలిపారు.

వుహాన్ మార్కెట్ లో సేకరించిన నమూనాలలో రాకూన్ శునకం న్యూక్లిక్ ఆమ్లం, వైరస్ న్యూక్లిక్ ఆమ్లం కలిసి ఉన్నట్లు గుర్తించారు.

రాకూన్ కుక్కకు వైరస్ సోకినా నేరుగా దాని నుంచి మానవులకు వ్యాప్తి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.అంతేకాకుండా మానవుల ద్వారానే అది దానికి సోకి ఉండోచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే కరోనా వైరస్ అనేది ప్రయోగశాల నుంచి లీకై ఉండవచ్చని అమెరికా ఇంధన శాఖ భావించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube