ఇద్దరి మద్దతు మోడీకే.. ఇదేం రాజకీయం !

రాజకీయాల్లో ఎవరికి ఎవరు శత్రువులు ఉండరు.ఎవరికి ఎవరు మిత్రులు ఉండరు అనే నానుడి ఉంది.

 Jagan And Chandrababu Are Supporting Modi, Jagan, Modi , Chandrababu Naidu , Tdp-TeluguStop.com

అంటే అవసరాన్ని బట్టి శత్రువులను, మిత్రులను డిసైడ్ చేసుకుంటూ ఉంటారు పోలిటికల్ లీడర్స్.అందుకు ఏపీ రాజకీయాలు మినహాయింపు కాదు.

ఏపీ సి‌ఎం వైఎస్ జగన్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు ఉప్పు నిప్పు లాగా ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటారు.వీరిద్దరి మద్య ఉండే రాజకీయ వైరం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది.

పరస్పర విమర్శలు, ధూషణలు, ఆరోపణలు.అబ్బో ఇలా ఒక్కటేంటి వీరిద్దరి యొక్క పార్టీల మద్య ఉండే రాజకీయ శత్రుత్వం జాతీయ మీడియాల్లో కూడా హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతుంటుంది.

Telugu Pmnarendramodi, Ap, Chandrababu, Modi, Ys Jagan-Politics

చంద్రబాబు( Chandrababu naidu ) చేసిన వాటిని జగన్ తప్పుబట్టడం, జగన్( Jagan ) అమలు చేసే విధానాలను చంద్రబాబు తప్పుబట్టడం ఒక ఒకరినొకరు తూర్పు పడమర లాగా భిన్న దృవలలోనే పయనిస్తూ ఉంటారు.ఇప్పుడు ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇద్దరు అధినేతలు కూడా మోడీ దోస్తీ కోసం అరటపడుతుండడం.అవునండి.ప్రస్తుతం టీడీపీ వైసీపీ పార్టీలు కేంద్ర అధికార పార్టీతో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని ఆయా సర్వేలు చెబుతున్నాయి.దీంతో కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ పెట్టుకునేందుకు ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారనేది పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట.

Telugu Pmnarendramodi, Ap, Chandrababu, Modi, Ys Jagan-Politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు.కానీ కేంద్రంలో బీజేపీకి జగన్ మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇక చంద్రబాబు కూడా బీజేపీతో కలిసి నడిచేందుకే ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం బీజేపీ టీడీపీ తో కలిసేందుకు సిద్దంగా లేనప్పటికి ఎన్నికల సమయానికి టీడీపీతో చేతులు కలిపిన ఆశ్చర్యం లేదు.

మరోవైపు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు గనుక రెండు పార్టీల అధినేతలతో సక్యత గానే మెలుగుతున్నారు మోడీ.ఏపీకి అన్యాయం చేసిన మోడీ సర్కార్ కు( Narendra Modi ) మద్దతు పలికేందుకు జగన్, చంద్రబాబు ఇద్దరు పోటీ పడుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే అని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి ఇద్దరు అధినేతల్లో మోడీ ఎవరితో చేతులు కలుపుతారో చూడాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube