సెన్సార్ పూర్తి చేసుకున్న నాని దసరా... రన్ టైం ఎంతంటే?

నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా డి గ్లామర్ పాత్రలలో మాస్ యాక్షన్ చిత్రం దసరా (Dasara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా (Pan India) స్థాయిలో మార్చి 30 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

 Nani Dasara Has Completed The Censor... What Is The Run Time ,dasara , Keerthy S-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని (Nani) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదలై దుమ్ములేపుతోంది.కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి కేక పెట్టించింది. ఈ ట్రైలర్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.ఇలా ఈ సినిమా ఇతర భాషలలో కూడా భారీ అంచనాలను ఏర్పరచుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్( sensor)పనులు కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది.చిన్న చిన్న కట్స్‌తో ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు.

సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ తో పాటు సినిమా రన్ టైం (Run Time) కూడా లాక్ చేశారు.ఈ సినిమా 2 గం.36 ని. ల నిడివి ఉండనుంది.ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమాకుసంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్.దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట.నాని సినిమాల్లోఈ సినిమా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube