Deepthi Sunaina: ప్రేమలో పడ్డానంటూ దీప్తి సునైనా వైరల్ పోస్ట్.. ఈసారి ఎవరితో అంటూ నెటిజన్స్ రచ్చ రచ్చ?

మాములుగా సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే చాలు వెంటనే అవి క్షణాల్లో వైరల్ అవుతాయి.ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు వాళ్లు షేర్ చేసే పోస్ట్ లు అలా ఉంటాయి కాబట్టి.

 Deepti Sunaina Viral Post Saying She Fell In Love-TeluguStop.com

అయితే తాజాగా దీప్తి సునైనా( Deepthi Sunaina ) షేర్ చేసిన పోస్ట్ కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.అది కూడా ఆమె ప్రేమలో పడ్డానంటూ( Fall In love ) పెద్ద షాక్ ఇచ్చింది.

దీంతో నెటిజన్స్ ఎవరితో అని తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

దీప్తి సునైనా డబ్ స్మాష్ వీడియోలతో పరిచయమై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై అవకాశాలు అందుకుంది.

ఇక బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక ఆ సమయంలో హౌస్ లోనే షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth ) పేరు తీసి అతడు ఎవరు అనేలా నెటిజనులతో చర్చలు చేయించింది.

షణ్ముఖ్ తో కలిసి యూట్యూబ్ లో పలు డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేసి షణ్ముఖ్ కు కూడా ఓ గుర్తింపు అందించింది.షణ్ముఖ్ కూడా యూట్యూబ్ స్టార్ గా మారి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక షణ్ముఖ్ కూడా ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.దీంతో ఇందులో అడుగు పెట్టినందుకు మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇక గతంలో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని నెట్టింట్లో బాగా ప్రచారాలు జరిగాయి.కానీ వీరిద్దరు మాత్రం తమ లవ్ గురించి ఏ రోజు కూడా బయట పెట్టలేదు.కానీ ఓసారి తమ మధ్య లవ్ నడుస్తున్న విషయం షణ్ముఖ్ ద్వారా బయటపడింది.బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముఖ్ తన పిల్లో పై దీప్తి సునయన పేరు రాయడంతో అసలు నిజాలు బయట పడ్డాయి.

అంతేకాకుండా షణ్ముఖ్ బర్త్ డే రోజు దీప్తి గ్రాండ్ సర్ ప్రైజ్ చేసి షణ్ముఖ్ ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది.దీంతో వీరి మధ్య లవ్ నిజమే అని క్లారిటీ వచ్చింది.

కానీ షన్ను బిగ్ బాస్ లో మరో కంటెస్టెంట్ సిరితో మితిమీరి ప్రవర్తించడం వల్ల దీపు బ్రేకప్ చెప్పుకుంది.ఆ సమయంలో తమ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.

కలవండి అంటూ బాగా రిక్వెస్ట్ లు చేశారు.

కానీ ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బిజీగా ఉన్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను మరోసారి ప్రేమలో పడ్డానని తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ పంచుకుంది.ఆ ఫోటోలో రకరకాలుగా ఫోజ్ లు ఇచ్చి ఫాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్ అని హగ్ ఇస్తున్న ఎమోజిస్ తో పాటు లవ్ సింబల్ పంచుకుంది.

దీంతో ఆమె నేర్చుకునే విషయంలో ప్రేమలో పడ్డానని తెలిపింది.అయితే నెటిజన్స్ కొందరు.ఎవరితో అంటూ సరదాగా కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube