రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావడంతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈ అవార్డు విషయంపై ఇప్పటివరకు ఏమాత్రం నోరు విప్పకపోవడంతో కొంతపాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరి కొందరు మాత్రం డబ్బులు ఇచ్చి ఆస్కార్ అవార్డును కొన్నారు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెల్ ఫెర్నాండిస్( Jacqueline Fernandes ) స్నేహితుడు షాన్ మట్టతిన్ మాత్రం ఆస్కార్ అవార్డు విషయంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే షాన్ మట్టతిన్( Shawn Mattatin ) ఆస్కార్ గురించి కామెంట్ చేస్తూ హా.హా.హా ఇది చాలా ఫన్నీ.ఇప్పటివరకు ఇండియాలో మాత్రమే అవార్డ్స్ కొనుక్కోవచ్చని అనుకున్నాను.కానీ ఇప్పుడు ఆస్కార్స్ లో కూడా అలానే.డబ్బులుంటే ఆస్కార్ కూడా కొనేయొచ్చు Lol’ అని షాన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈయన వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ స్పందిస్తూ ముందు మీరు యాక్టింగ్ నేర్చుకోండి, ఆ తర్వాత అవార్డుల గురించి ఆలోచిద్దురు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు ఈ కామెంట్ పై స్పందిస్తూ అలా డబ్బులు ఇచ్చి అవార్డులనుకునే ఆనవాయితీ మీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉందేమో సౌత్ ఇండస్ట్రీలో కాదు అంటూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు.ఏది ఏమైనా ఒక భారతీయ సినిమాకు దక్కినటువంటి ఈ అద్భుతమైన గౌరవాన్ని అభినందించాల్సింది పోయి ఇలా డబ్బులు ఇచ్చి కొన్నారు అంటూ కామెంట్లు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇలాంటి ఒక గొప్ప అవార్డు గురించి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మౌనం వహిస్తుండడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.







