Richa Panai: అందంగా ఉన్నా సరే అవకాశాలు లేక ఆ పనికి సిద్దమైన హీరోయిన్?

నటి రిచా పనయ్( Richa Panai ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె మొదట అల్లరి నరేష్ హీరోగా నటించిన యముడికి మొగుడు( Yamudiki Mogudu ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

 Exclusive Interview Heroine Richa Panai About Her Marriage And Cine Career-TeluguStop.com

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు.చందమామ కథలు, రక్షక భటుడు లాంటి సినిమాలలో నటించినా కూడా ఆమెకు తగిన గుర్తింపు దక్కాలేదు.

అవకాశాలు లేకపోవడంతో నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.లాక్ డౌన్ సమయంలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ కనుమరుగైపోవడం మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు.

ఇది ఇలా ఉంటే రిచా పనయ్ తాజాగా హైదరాబాదులో మెరిసింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కరోనా లాక్‌డౌన్‌లో నేను రెండు సినిమాలు చేశాను.

అవి ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నాను.అందులో ఒకటి శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో తెరకెక్కిన బృందావనమది అందరిది( Brundavanamidi andaridi ) సినిమా కాగా, రెండోది నీలకంఠ గారి దర్శకత్వంలో తెరకెక్కింది.

అవి విడుదలైన తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది రిచా పనయ్. షూటింగ్ అప్పటి రోజులను మిస్ అవుతున్నాను.

Telugu Career, Richa Panai, Naresh, Tollywood, Yamudiki Mogudu-Movie

ఆ రోజులు నాకు ఎంతో మొమరబుల్ డేస్.కాని సినిమా అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని భావించలేం.అందుకే ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నాను.క్యాట్ కాఫీ స్టూడియోని స్టార్ట్ చేశాను.ఆ బిజినెస్ చూసుకుంటున్నాను.నా ఫోకస్ అంతా దానిపైనే ఉంది.

అయితే మంచి అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను.మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నాను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Telugu Career, Richa Panai, Naresh, Tollywood, Yamudiki Mogudu-Movie

అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం విషయం గురించి మాట్లాడుతూ.ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని.కానీ ఇప్పుడు ప్రస్తుతం అంత యాక్టివ్‌గా ఉండటం లేదు.అందులో నెగిటివిటి బాగా పెరిగిపోయింది.నేను కామెంట్స్ పెద్దగా చూడను, చదవను.ఏదైనా బ్యాడ్ కామెంట్ ఉంటే డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటే బాగుంటుంది.

కానీ మా అమ్మ మాత్రం అన్ని కామెంట్స్‌ను చదువుతూ ఉంటుంది అని తెలిపింది రిచా పనయ్.తన పెళ్లి గురించి స్పందిస్తూ నెక్స్ట్ ఇయర్ ఉండవచ్చు అని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube