రైల్వేల చొరవకు ఆనంద్ మహీంద్ర ఫిదా అయిపోయారు... విషయం ఏమంటే?

భారతీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర( Anand Mahindra ) గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు.నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా వుంటూ ముఖ్యంగా యువతను వివిధ అంశాల్లో ప్రోత్సహిస్తూ వుంటారు.

 Anand Mahindra Is Fed Up With The Initiative Of Railways What Is The Matter, Ral-TeluguStop.com

ఎవరైతే కొత్త కొత్త ఆలోచనలు చేస్తారో వారికి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ కలిపిస్తూ వుంటారు.ఇకపోతే నేడు కాలం చాలా మారింది.

ఒకప్పుడు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే ట్రాన్స్‌జండ‌ర్లు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ధైర్యంగా అడుగుపెడుతున్నారు.అవును, ఈ క్రమంలోనే పూర్తిగా ట్రాన్స్‌జండర్లు ( Transgenders )నిర్వ‌హించే టీ స్టాల్‌ను గువ‌హ‌టి రైల్వేస్టేష‌న్‌లో భార‌తీయ రైల్వేలు ఏర్పాటు చేయ‌డం జరిగింది.

కాగా ఈ విషయం పట్ల అన్ని వర్గాల ప్రజలనుండి సానుకూల స్పంద‌న వస్తోంది.తాజాగా రైల్వేల చొర‌వ‌ను కార్పొరేట్ దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్ర ప్ర‌శంసిస్తూ న్యూ ట్రాన్స్ టీస్టాల్( New Trance Teastal ) ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయడం జరిగింది.ఈ విషయం ఆనంద్ మ‌హీంద్ర త‌న పోస్ట్‌ను రైల్వే మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్‌కు( Ashwani Vaishnav ) ట్యాగ్ చేశారు.ఈ సందర్భంలో ఆయన ఇలా రాసుకొచ్చారు… “మీరు చేప‌ట్టిన ఈ చిరు ప్ర‌య‌త్నం, చొర‌వ నిజంగా అద్భుతం.

అది నా దృష్టిలో అత్యంత ప్రాధాన్య‌త‌తో కూడిన కార్యక్రమం!” అని ఆనంద్ మ‌హీంద్ర రాసుకొచ్చారు.

ఇక సదరు పోస్టుని చూసిన నెటిజన్లు కూడా అంతే పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.ఈశాన్య భార‌త్ నుంచి ఇటీవ‌ల మ‌నం ఎన్నో ప్ర‌శంసాత్మ‌క కార్య‌క్ర‌మాలు, ఘ‌న‌విజ‌యాల‌ను చూస్తున్నామ‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయగా… ఈ స్టాల్‌ను ట్రాన్స్ టీ స్టాల్ అని పిల‌వ‌డం అయితే స‌రైంది కాద‌ని ప‌లువురు యూజ‌ర్లు సలహాలు ఇస్తున్నారు.ఈ కామెంటుకి చాలామంది మద్దతు తెలుపుతున్నారు.

ఇది ఓ టీస్టాల్ మాత్ర‌మేన‌ని మూడో జండ‌ర్‌తో దీనికి సంబంధం లేద‌ని కొందరు అంటున్నారు.థ‌ర్డ్ జండ‌ర్ అని తెలిస్తే కొంద‌రు వారి నుంచి టీ, స్నాక్స్ తీసుకోవ‌డానికి ముందుకు రాక‌పోవ‌చ్చ‌ని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube