నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప రిజర్వాయర్ ప్యాకేజీ 21, 22 పనులను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించారు.కేసీఆర్ స్వార్థానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ బలి అయిందని విమర్శించారు.
రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రూ.3500 కోట్లకు పెంచారని రేవంత్ రెడ్డి తెలిపారు.భూసేకరణతో పది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని వెల్లడించారు.
భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే అరెస్ట్ చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వారిపై కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని విడుదల చేయాలన్నారు.
తొమ్మిది ఏళ్లైనా 21వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదని చెప్పారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
భూ నిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.







