వినడానికి చోద్యంగా వుంది కదూ.బ్రిటిషర్లు ట్రాక్ వేయడం ఏమిటి? ఇండియన్లు అద్దె కట్టడం ఏమిటని అని ఆలోచిస్తున్నారు కదూ.విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి కధనం చదవండి మరి.ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా పేరుగాంచిన ఇండియన్ రైల్వేస్‌కు(Indian Railways).అద్దె కట్టే ఓ రైల్వే లైన్ ఉందని చాలా మందికి తెలియదు.అయితే ఈ లైన్‌పై రైలును నడిపినందుకు ఇప్పటికీ బ్రిటిషర్లకు మన భారతీయ రైల్వే రూ.కోటి కడుతోంది.అవును, మహారాష్ట్రలోని యావత్మాల్ – ముర్తిజాపుర్(Yavatmal – Murtijapur) మధ్య ఉన్న ఈ రైల్వే లైన్‌ను బ్రిటిష్ పాలకులు నిర్మించడం జరిగింది.

అయితే వారు వారు మన దేశం విడిచి వెళ్లినా కూడా ఆ లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉండడం కొసమెరుపు.1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఈ లైన్‌ను జాతీయీకరణ చేయడం మన అధికారులు మరిచిపోయారు.దానివల్లనే ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు సంవత్సరానికి రూ.కోటి కడుతోంది మన భారతీయ రైల్వే.ప్రస్తుతం ఈ రైల్వే లైన్ అమరావతి జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.20 గంటలపాటు సాగే ఈ ప్రయాణానికి రూ.150 టికెట్ ధరగా పెట్టింది మన రైల్వే.

సిగ్నలింగ్, టికెట్ల విక్రయం, క్యారేజీల నుంచి ఇంజిన్ వేరు చేసేందుకు ఈ లైన్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది పని చేస్తున్నారని సమాచారం.నారో గేజ్‌గా ఉన్న యావత్మాల్- ముర్తిజాపుర్ రైల్వే మార్గాన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.ఇందుకోసం అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు(Railway Minister Suresh Prabhu) రూ.1,500 కోట్లను కేటాయించడం విశేషం.కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు.
ఎందుకంటే దీనిపైన కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యవారికి ఒక్క ప్రశ్న అయినా వస్తుంది.మరీ ముఖ్యంగా రెయిల్వే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారు ఈ విషయం తెలుసుకోవడం అవసరం.







