ఈ సెకండ్ హ్యాండ్ బాస్కెట్ ధర అక్షరాలా లక్ష డాలర్లు.. అంత స్పెషల్ ఏంటంటే..

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన చానెల్(Chanel), ఇటీవల ఒక బాస్కెట్‌ను చాలా అధిక ధరకి అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ధర చూసి షాక్ అవ్వడం నెటిజన్ల వంతయ్యింది.

 The Price Of This Second Hand Basket Is Literally One Hundred Thousand Dollarswh-TeluguStop.com

మళ్లీ ఇది సెకండ్ హ్యాండ్ వస్తువు కావడం గమనార్హం.దీనిని ‘షాపింగ్ బాస్కెట్‘(Shopping basket)గా కంపెనీ పిలుస్తోంది.

ఇది మీరు సూపర్ మార్కెట్‌లో చూసే సాధారణ షాపింగ్ బాస్కెట్ కాదు ఇది వెండి పూతతో, నల్లటి తోలుతో చుట్టబడి బ్రాండ్ ఇంటర్‌లాకింగ్ Cs లోగోతో అలంకరించబడింది.ఈ లగ్జరీ బాస్కెట్‌ను 2014లో కంపెనీ ఇతరుల నుంచి కొనుగోలు చేసింది.

ఈ బుట్ట మూడు పరిమాణాలలో వస్తుంది.

ఈ ఉత్పత్తి ఫార్‌ఫెచ్ వెబ్‌సైట్‌లో $101,298 డాలర్లకు సేల్ అవుతుంది.అంటే అక్షరాలా 83 లక్షల రూపాయలు.ఇంత అమౌంట్ పెడితే లగ్జరీ కారే వస్తుంది.

అలాంటిది ఈ చిన్న బుట్ట అంత ధర ఏంటి అని చాలామంది గందరగోళానికి గురవుతున్నారు.ఆ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకోవచ్చని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇకపోతే చానెల్ దాని ప్రత్యేకమైన ఫ్యాషన్ ఐడియాలు,(Fashion Ideas) అధిక ధరలతో ఎప్పుడూ అందరినీ స్టన్ అయ్యేలా చేస్తూనే ఉంటుంది.ఇప్పుడు మాత్రం వెయ్యి రూపాయలు కూడా ఖరీదు చేయని బుట్టను ఏకంగా లక్షల్లో అమ్ముతోంది.బ్రాండ్ పేరు వాడుకొని ఇంత డబ్బులు వసూలు చేయడం అన్యాయమని కొందరు కామెంట్లు పెడుతున్నారు.అయితే ధనవంతులు ఫ్యాషన్ కోసం బుట్టని కూడా లక్షల ధర పెట్టి కొనుగోలు చేస్తారు అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube